NLR: కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అందజేశారు.