ATP: గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో రోడ్డుపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు గురువారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. కాలనీవాసులు కృష్ణ గోపాల్, మస్తానమ్మ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయాకు వినతిపత్రం అందజేశారు.