కృష్ణా: కుల, మత తారతమ్యాలకు తావు లేకుండా, సమానత్వ భావనను బోధించే పవిత్ర తత్వమే అయ్యప్ప స్వామి మాల అని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం అంపాపురంలో జరిగిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శబరిమల వాసునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.