KKD: కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. పిఠాపురం మహారాజా దానం చేసిన ఆనంద నిలయం సుమారు రూ.1000 కోట్ల ఆస్తి ఆక్రమణ, అన్యాక్రమిత విద్యా భూముల అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఐటీ సెజ్ అభివృద్ధి, కాకినాడ స్మార్ట్ సిటీ కోసం నిధుల కేటాయింపు, పనులను వేగవంతం చేయాలని ప్రత్యేకంగా వినతి చేశారు.