PLD: పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాత్రి వేళ పగులగొట్టి అందులోని కాపర్వైరును అపహరించుకుపోయే ఒక ముఠాను అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆ ముఠా వివరాలను వెల్లడించారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో మొత్తం 30కి పైగా ట్రాన్స్ఫార్మర్లను దొంగతనం చేశారన్నారు.