SKLM: పేదల సంక్షేమము కొరకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారని మెలియాపుట్టి మండల మాజీ టీడీపీ అధ్యక్షుడు అనపాన రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మెలియాపుట్టి రాజా వీధిలో ఘనముగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. గూడ ఎండయ్య బైరసింగి ధరణి తదితరులు పాల్గొన్నారు.