విశాఖ ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి సోమవారం ప్రారంభించారు. నగరంలో నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేయడం, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ కొత్త క్రైమ్ స్టేషన్ లక్ష్యమని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలొ అండ్ ఆర్డర్ డీసీపీ మణికంఠ, ఏసీపీ ద్వారక నరసింహమూర్తి పాల్గొన్నారు.