AKP: కోటవురట్ల(మం) జల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్క్రబ్ టైఫస్పై వైద్యారోగ్య సిబ్బంది గురువారం అవగాహన కల్పించారు. పొలాల్లో స్క్రబ్ పురుగు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అని హెచ్చరించారు.