VZM: బొబ్బిలి(మం) కలవరాయి, జగన్నాధపురం, కోమటపల్లిలో రైస్ మిల్లలను బొబ్బిలి తహసీల్దార్ ఏం. శ్రీను ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. రైతులు వద్ద అదనంగా ధాన్యం తీసుకోవద్దని మిల్లర్లును హెచ్చరించారు. ట్రాక్ షీట్ పెండింగ్ ఉంచకుండా అక్కనౌల్డమెంట్ చెయ్యాలని కోరారు. ఈ తనిఖీల్లో సీఎస్డీటీ రవి కృష్ణ పాల్గొన్నారు.