GNTR: సంక్రాంతి నాటికి రహదారుల మరమ్మతు పనులను పూర్తి చేసి, గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాల్సిందేనని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం ఆర్&బీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దిష్ట కాల పరిమితిని పెట్టుకుని మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.