CTR: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం, ఆనందమని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు పట్టణంలోని గంగినేని చేరువు వద్ద స్వచ్ఛతహి సేవ 2025 కార్యక్రమం నిర్వహించారు. “ఏక్ దిన్..ఏక్ గంట..ఏక్ సాత్ స్వచ్ఛత” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.