ELR: ఉంగుటూరు గ్రామ పరిధిలోని ఏలూరు కాలవ గట్టుకు ఇరువైపులా ఉన్న అక్రమ దారులకు 130 మందికి నోటీసులు ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి బొడ్డు వెంకట రవి కుమార్ బుధవారం తెలిపారు. స్వచ్ఛందంగా వారు ఆక్రమణ తొలగించుకోవాలని, లేకపోతే రెవిన్యూ, పోలీస్ శాఖ సమక్షంలో తొలగిస్తామన్నారు. ఆక్రమణదారులకు ఇప్పటికే అనేకసార్లు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు.