KRNL: కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజనం వడ్డిస్తున్న తీరును స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ రుచికరమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. భోజన నాణ్యతలో రాజీపడకూడదని ఆదేశించారు.