AKP: సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలోని సీతారాముల వారి ఆలయంలో ధ్వజస్తంభం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అదీప్ రాజు పాల్గొన్నారు.