కర్నూలు: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. మల్లన్న దర్శనార్థమై ఆలయానికి వచ్చిన ఆయనకు రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.