కోనసీమ: రాజోలు మండలం శివకోడు జడ్పీహెచ్ స్కూల్కు చెందిన విద్యార్థిని పైడిమర్రి ఇంద్రజ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించినట్లు హెచ్ఎం నైనాల శ్రీనివాస్ బుధవారం తెలిపారు. సఖినేటిపల్లి మోరిలో జరిగిన ఈ పోటీల్లో అండర్-17 టీం ఈవెంట్లో ఇంద్రజ ఈ ప్రతిభ చూపింది. కాంస్యం సాధించిన ఇంద్రజను సర్పంచ్ రామారావు, పాఠశాల సిబ్బంది అభినందించారు.