CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంక్‌ను శుక్రవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రారంభోత్సవం అనంతరం ఆయన స్వయంగా రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బ్లడ్ బ్యాంక్ వల్ల కుప్పం పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన రక్తం అందుతుందని, రక్తదాతలు ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేయాలని ఆయన అభ్యర్థించారు.