GNTR: మంగళగిరిలోని ఎకో పార్కులో మార్నింగ్ వాకర్స్ ద్వారా ఏటా లభించే రూ.5లక్షలను తన వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇకపై మంగళగిరి ప్రాంత వాసులు ఎటువంటి రుసుం లేకుండా ఉదయం 6 నుంచి 9గంటల వరకు ఎకో పార్కులో నడక సాగించవచ్చని తెలియజేశారు.