కర్నూలు: నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్ హాల్లో మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుస్తులు, అర్హులైన వారికి వీల్ చైర్, కుట్టు మిషన్లు, చెవిటి మిషన్లు, స్కాలర్షిప్లు, నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.