BPT: గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల అధికారులకు సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నాగలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.