W.G: పాలకొల్లు మారుతీ థియేటర్ వద్ద ఇవాళ వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఏ ఒక్క కులానికో పరిమితం కాలేదని, బడుగు, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ MLC అంగర రామ్మోహన్ రావు తదితర నేతలు పాల్గొన్నారు.