EG: రాజమండ్రి రూరల్ ధవలేశ్వరంలో ఎంపీ పురందేశ్వరి బుధవారం పర్యటించారు. సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం సందర్శించి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులతో కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ సంఘటనా బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం, కార్యకర్తల సమన్వయం, స్థానిక ప్రజా సమస్యల గుర్తింపుపై చర్చించారు.