E.G: పండుగ 2.0 వారోత్సవాలలో భాగంగా సీతానగరం మండలం హుండేశ్వరపురం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం శంకుస్థాపన చేశారు. డీఎంఎఫ్ కింద రూ.10 లక్షల వ్యయంతో బీసీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల అవసరాల మేరకు గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.