AKP: గొలుగొండ మండలం ఏటిగైరంపేట ఎరువుల దుకాణంను మండల వ్యవసాయాధికారి కే.సుధారాణి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ నిల్వలను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఎరువులు విక్రయాలు చేపట్టాలని, అధిక రేట్లకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.