VSP: సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. ప్రస్తుతం ఈ రైలు గురువారం మినహా వారంలో మిగతా అన్ని రోజుల్లో నడుస్తోంది. అయితే డిసెంబర్ 2 నుంచి సోమవారం మాత్రమే రద్దు అవుతుంది. వారంలో ఆరు రోజులూ నడుస్తుంది. కానీ సోమవారం మాత్రం అందుబాటులో ఉండదని రైల్వే శాఖ తెలిపింది.