E.G: ధవలేశ్వరం ఎస్ఎసీ బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం దగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకు బ్యారేజ్ వద్ద నీటిమట్టం 13.20 అడుగులు ఉండగా, 11.79 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్ర జలాల్లోకి విడిచిపెడుతున్నారు. కాగా, మూడు ప్రధాన పంట కాలువలు ద్వారా 12,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు