అన్నమయ్య: మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని నిస్సార్ అహ్మద్ గుర్తుచేశారు. బుధవారం మదనపల్లె పట్టణంలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మైనారిటీలు ఏకతాటిగా ముందుకు వచ్చి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు.