SKLM: లావేరు మండల కేంద్రంలో ఉన్న స్త్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అర్చకులు ఋషి కుమార్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలతో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు గోత్రనామాలతో పూజలు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.