ATP: గుత్తి కేబీఎన్ మసీదులో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు భక్తిశ్రద్ధలతో షబ్- ఎ- మెరాజ్ (పెద్దరాత్రి) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా హాఫీజ్ సాబ్ హుస్సేన్ మసీదులో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేశారు. అనంతరం అల్లాను వేడుకుంటూ దువా చేశారు. హాఫీజ్ సాబ్ షబ్- ఎ- మెరాజ్ విశిష్టత గురించి తెలిపారు.