PPM: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ పవర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన పంట దళారుల పాలవుతోందని వాపోయారు. ఈ మేరకు ఈ నెల 12న కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసన తెలియజేస్తామని తెలిపారు.