NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 2026 జనవరి 1న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా జనవరి ఒకటో తేదీన అధికారులు, నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి పూల దండలు, బొకేలతో వస్తుంటారు. కానీ అలాంటివి వద్దని, మీ అభిమానంతో విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పూల మొక్కలు, పండ్లు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.