ASR: ఆసుపత్రికి వచ్చేందుకు మొండికేసిన గర్భిణిని పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కొయ్యూరు మండలం లోయలపాలెంకు చెందిన డీ.సంధ్యకు నెలలు నిండాయి. వైద్య సిబ్బంది ఆమెను ప్రసవం కోసం శుక్రవారం ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. అయితే ఆమె ఆసుపత్రికి రానంటూ మొండికేసింది. దీంతో వారు మంప ఎస్సై శంకరరావుకు విషయం తెలిపారు. ఆయన నచ్చచెప్పి ఆసుపత్రికి తరలించారు.