SKLM: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించమని ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం సాయంత్రం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతి మండలాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాలలో తనిఖీలు పెంచాలని అధికారులను ఆదేశించారు.