KRNL: పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌ను పెద్దకడబూరు MPP శ్రీవిద్య సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మండల వైద్యాధికారిని ఖేజియా మాట్లాడుతూ.. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.