KRNL: ఎమ్మిగనూరులో ఇవాళ జరిగిన సీపీఎం పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, మాజీ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇరాన్ దేశంతో యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం మవుతున్నాయని, యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు.