SKLM: లావేరు శాఖా గ్రంథాలయంలో రేపటి నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నామని గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. కథలు, కథనాలు సృజనాత్మక కృత్యాలు, కథలు చెప్పడం, చదవడం మాకిష్టం, స్పోకెన్ ఇంగ్లీష్, యోగపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు వేసవి శిక్షణ తరగతులను వినియోగించుకోవాలన్నారు.