కోనసీమ: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అమలాపురం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం, కిడ్నీ సంబంధిత చికిత్స విభాగాలను ఆయన సందర్శించారు. ప్రతి ఒక్కరూ ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.