E.G: సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దావోస్ పర్యటనతో రాష్ట్రం మరింత ప్రగతిపథంలో పయనించడం ఖాయమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజన్ -2047 లక్ష్యంగా తనవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు.