SKLM: నరసన్నపేట ఈఓఆర్డీగా విధులు నిర్వహిస్తున్న మొజ్జాడ రేణుకకు ఎంపీడీవోగా పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం ఉదయం ఆమె మాట్లాడుతూ.. తనకు పదోన్నతి లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 1993లో వీడీవోగా విధుల్లో చేరిన ఆమె, కోటబొమ్మాలి, ఆమదాలవలస, సారవకోటలలో ఈవోఆర్డీగా పనిచేశారు. స్థానిక సిబ్బంది ఆమెను అభినందించారు.