VZM: పైడితల్లి అమ్మవారి పండగ ప్రతి ఒక్కరి మదిలో మధుర స్మృతిగా నిలిచిపోవాలని MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం అమ్మవారి పండగ, ఉత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరమంతా సుందరీకరణ చేయాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిధుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని ఆదేశించారు.