VZM: జిల్లాకు నూతన కలెక్టర్గా వచ్చిన ఎస్.రామసుందర్ రెడ్డిని ఆయన ఛాంబర్లో శనివారం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలుపుతూ పూల మొక్కను అందజేశారు. జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తూ.. ఎస్.కోట అభివృద్ధికి తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.