SKLM: ఏపీ అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీలో సభ్యుడిగా పాతపట్నం నియోజకవర్గం MLA మామిడి గోవిందరావును నియమించారు. ఈ మేరకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించినట్లు పార్టీ కార్యాలయం నుంచి శుక్రవారం తెలిపారు. వెనుకబడిన నియోజకవర్గమే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను గుర్తించి ప్రివిలేజ్ కమిటీలో స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.