E.G: కె.గంగవరం మండలం ఊడిమూడిలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు తాడాల వీర వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. కాకినాడ, వైజాగ్ నుంచి డాక్టర్లు వస్తారని, సమీప గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ప్రారంభిస్తారన్నారు.