ASR: నేషనల్ హైవే నిర్మాణంలో కాఫీ తోటలు కోల్పోతున్నపెద్దవలస, చాపరాతిపాలెం గ్రామాలకు చెందిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు ఇవాళ పాడేరులో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. కాఫీ, మిరియాల తోటలను కోల్పోతున్న రైతులకు న్యాయబద్ధంగా నష్టపరిహారం అంచనా వేయాలని కోరారు. అనంతరం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.