SKLM: రథసప్తమిని రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో సోమవారం సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యోగాలో డిప్లొమా తీసుకున్న ఉపాధ్యాయుడు రెడ్డి సూరిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. సూర్య నమస్కారాలు చేయడం వలన మానశిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.