AKP: నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ బుధవారం గొలుగొండ మండలం పాకలపాడు, రావణాపల్లి, కొమిర, ఏటిగైరంపేటలో డ్రోన్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి డంప్, తరలింపు ఉన్నాయా అనే దానిపై నిఘా పెట్టారు. ఎవరైనా గంజాయి తరలింపులో పాల్గొన్న, సహకరించిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామారావు పాల్గొన్నారు.