PLD: వినుకొండ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ, ఆలయ జీర్ణోద్ధరణ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.