VZM: సాలూరు ఎమ్మెల్యే,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమలు శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెంటాడ మండలంలోని జయతి గ్రామ శివాలయంలో మహా శివునికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు. మహశివరాత్రిని పురస్కరించుకొని మంత్రి సంధ్యారాణి మౌనవ్రతం పాటించారు.