ATP: వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో మస్తానమ్మ అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం, వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. 2.5 తులాల బంగారం, రూ.18 వేలు నగదు, రెండు వెండి బ్రాస్లెట్లు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు చోరీని పరిశీలించి కేసు నమోదు చేశారు.