BPT: బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని వాటర్ ప్లాంట్స్‌ను సీనియర్ వాటర్ ఎనలిస్ట్ రాజరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్లాంట్ల నందు నీటి నమూనాలను సేకరించి ప్లాంట్ యజమానులకు పలు సూచనలు చేశారు. పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్లాంట్ నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అనుమతి తప్పక పొందాలన్నారు.